వేద న్యూస్, వరంగల్ టౌన్:
గ్రేటర్ వరంగల్ కాశిబుగ్గ మున్సిపల్ కాంప్లెక్స్ వద్దనున్న బస్టాండ్ లో ఓ ఇద్దరు మహిళలు క్రైస్తవ మత ప్రచారం నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ రాష్ట్రీయ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు మడిపెల్లి నాగరాజు గౌడ్ తో పాటు స్థానికులు అడ్డుకుని వాగ్వాదానికి దిగారు.

దాదాపు నాలుగు నెలల నుంచి అన్యమత ప్రచారం జరుగుతుందని కాలేజీలకు వెళ్లే హిందూ అమ్మాయిలను టార్గెట్ గా చేసుకొని ఈ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని వారు బుధవారం ఆరోపించారు. అడ్డుకున్న వారిలో రాష్ట్రీయ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు మండల భూపాల్, కోమాకుల నాగరాజు, సతీష్ కట్టర్, రాష్ట్ర హిందూ పరిషత్ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.