– హుజురాబాద్ సహాయ కార్మిక శాఖ అధికారిణి డి. చందన
– రామలింగారెడ్డి ఆసుపత్రికి ఎదురుగా కార్మిక శాఖ కార్యాలయం ఏర్పాటు
వేద న్యూస్, హుజురాబాద్:
కార్మిక శాఖ ద్వారా లేబర్ కార్డులు పొందిన ప్రతి కార్మికుడు తప్పనిసరిగా గడువులోపు కార్డులను రెన్యువల్ చేసుకోవాలని హుజురాబాద్ సహాయ కార్మిక శాఖ అధికారిణి డి. చందన అన్నారు. శనివారం కార్మిక శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. లేబర్ కార్డులు పొందిన ప్రతి కార్మికుడు గడువులోగా రెన్యువల్ చేసుకోవాలని లేనియెడల కార్మిక సంక్షేమ శాఖ ద్వారా లభించే అన్ని రకాల లబ్ధికి అనర్హులు అవుతారని పేర్కొన్నారు.
గడువులోపు రెన్యువల్ చేసుకోవడం వలన అన్ని రకాల లబ్దీలు పొందడానికి అర్హత సాధిస్తారన్నారు. ఇప్పటివరకు అనేక మంది కార్మికులు తమ తమ కూతుళ్ళ పెళ్లి కానుకలు, ప్రసూతి లబ్ది మరియు సహజ మరణాలకు ప్రమాదవశాత్తు మరణం సంభవించిన వారు కూడా చాలామంది శాఖ ద్వారా లబ్ది పొందినారని తెలిపారు. అలాగే గతంలో కరీంనగర్ రోడ్ లో ఉన్న కార్మిక శాఖ కార్యాలయం పట్టణంలోని మున్సిపాలిటీ రోడ్డులో రామలింగారెడ్డి ఆసుపత్రి కి ఎదురుగా గల 19-13 నంబర్ ఇంట్లోకి మార్చినట్లు తెలిపారు. కార్మికులంతా గమనించాలని కోరారు.