- జనసేన నర్సంపేట నియోజకవర్గ ఇన్ చార్జి శివకోటి యాదవ్
- “జనంతో జనసేన- ప్రజా బాట”లో భాగంగా చెన్నారావుపేటలో ప్రచారం
వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి:
గాజు గ్లాసు గుర్తుకు ఓటేసి సామాన్యులను గెలిపించాలని జనసేన నర్సంపేట నియోజకవర్గ ఇన్ చార్జి మెరుగు శివకోటి యాదవ్ ప్రజలను అభ్యర్థించారు. బుధవారం ఆయన నర్సంపేట నియోజకవర్గ పరిధిలోని చెన్నారావుపేట మండలకేంద్రంలో ప్రచారం నిర్వహించారు. “జనంతో జనసేన- ప్రజా బాట” కార్యక్రమంలో భాగంగా ప్రజలకు జనసేన సిద్ధాంతాలను వివరించారు.

ఈ సందర్భంగా మెరుగు మాట్లాడుతూ ‘మీ మధ్యలో నుంచి మీ ఇంటి బిడ్డగా మీ ముందుకు వస్తున్నా, మన కష్టాలు కన్నీళ్లు తెలిసిన వాడిని’ అని అన్నారు. జనసేన పార్టీ సామాన్యులకు అండగా ఉండే పార్టీ, సామాన్యుల కోసం పుట్టిన పార్టీ
అని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ నర్సంపేట నియోజవర్గంలో పోటీ చేస్తున్నదని జనానికి తెలిపారు.

చెన్నారావుపేట మండల కేంద్రంలో ప్రధాన కార్యదర్శి గాండ్ల అరుణ్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో శివకోటి యాదవ్ ప్రజలకు జనసేన పార్టీ సిద్ధాంతాలను వివరించారు. తమ అధినేత పవన్ కల్యాణ్ స్ఫూర్తితో నియోజవర్గంలో చేసిన ప్రజాసేవ, పోరాట కార్యక్రమాలను గురించి స్జష్టం చేశారు. జనసేన పార్టీ సామాన్యుల కోసం పుట్టిందని,సామాన్యులకు అండగా ఉంటుందని వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ “గాజు గ్లాసు’’ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో జనసేన నాయకులు వంగ మధు ఓర్సు రాజేందర్,కుండె రాజ్ కుమార్, సాయి ఈశ్వర్, ఎలబోయిన డేవిడ్, బొబ్బ పృద్వి రాజ్, కిరణ్,అభిషేక్, రాకేష్ పాల్గొన్నారు.