వేద న్యూస్, వరంగల్:

పరకాల అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీగా ఎన్నికైన  దామెర రాజు ను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి శాలువాతో ఆదివారం సత్కరించారు.  కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ‘స్థానిక’ ఎన్నికల్లో ఘనవిజయం సాధించడం కోసం పని చేయాలని స్పష్టం చేశారు.