వేద న్యూస్, వరంగల్:

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఐటీ ఉద్యోగి కాదు.. ఐటీ బ్రాండ్ అంబాసిడర్ అని కేటీఆర్ సేన వరంగల్ జిల్లా అధ్యక్షుడు నరేష్ మైనాల పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

కేటీఆర్ ఐటీ మంత్రిగా  దేశంలోనే నంబర్ వన్ స్థానం లో  తెలంగాణను నిలిపారని, ప్రపంచ దిగ్గజ కంపెనీలు అన్ని హైదరాబాద్ కి తీసుకువచ్చి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను శిఖర స్థాయికి చేర్చారని వెల్లడించారు. 

రేవంత్ రెడ్డి సీఎం సీటు ను కొనుక్కోగలిగారని కానీ, ఇంగ్లిష్ ను కొనుక్కోలేక  కేటీఆర్ పై అసూయతో ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో ఐటీ మంత్రిగా కేటీఆర్ ఐటీ సంస్థలను హైదరాబాద్ కు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారని స్పష్టం చేశారు.