వేద న్యూస్, సూర్యాపేట ప్రతినిధి :
కేతపల్లి మండలంలోని భీమారం గ్రామంలో పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం మైనార్టీ సోదరులకు భీమవరం గ్రామ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ నాయకులు బడుగుల నరేందర్ యాదవ్ ఇఫ్తార్ విందుని ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని మసీదులో ముస్లింలు పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్ష కఠినంగా చేపడతారని వారందరూ కలిసి దేశ ప్రజలందరు సుఖ సంతోషాలతో ఉండాలని భక్తిశ్రద్ధలతో అల్లాని ప్రార్థిస్తారని తెలియజేశారు. మతసామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగని ముస్లిం సోదరులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ముస్లిం సోదరులకు తోఫా తో పాటు ఇఫ్తార్ విందును ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మత పెద్దలు మసీదు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.