YCP MLC suspended...!YCP MLC suspended...!

వేదన్యూస్ – తాడేపల్లి(ఏపీ)

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ  దువ్వాడ శ్రీనివాస్ కు ఆ పార్టీ బిగ్ షాకిచ్చింది. ఇందులో భాగంగా మాజీ సీఎం.. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ శ్రీనివాస్ ను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.

పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘణకు పాల్పడినట్లు ఎమ్మెల్సీపై పిర్యాదులు ఆధిష్టానానికి వచ్చాయి. ఈ క్రమంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ లేఖను పార్టీ కేంద్ర కార్యాలయం పేరుతో మీడియా ప్రకటనను విడుదల చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *