వేద న్యూస్, హన్మకొండ :
గ్రేటర్ వరంగల్ నగరం పరిధిలోని ల్యాదెల్లలో బుధవారం “సోలాపురం పోయినను” అనే జానపద పాటను చిత్రీకరించారు. ‘ ఫ్లై ఆన్ రీల్స్’ యూ ట్యూబ్ ఛానల్ నిర్మిస్తున్న ఈ పాటలో చిత్రీకరణలో నటి నటులుగా భ్రమరాంబికా, ఈశ్వర్ సాయి చేశారు.కాగా శేఖర్ వైరస్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరించారు.
ఈ సందర్భంగా ఫ్లై ఆన్ రీల్స్’ ఫౌండర్స్ ఎన్. వినీత్, ఎల్. కృష్ణ, బి.శ్యామ్ సుందర్ లు మాట్లాడుతూ.. భార్య, భర్త మధ్య జరిగే సరసాలతో జానపద పాటను చిత్రీకరించినట్లు తెలిపారు. పాట చిత్రీకరణ సమయంలో సహకరించిన ల్యాదెల్ల గ్రామ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.