వేద న్యూస్ , హుజురాబాద్ టౌన్ :

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని జనతాదళ్ ( సెక్యులర్ ) పార్టీ జేడీఎస్ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి తెలిపారు.

ఆదివారం కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో ఆయన మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు.

తమ పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని భారత మాజీ ప్రధాని దేవేగౌడ నేతృత్వంలో ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు వస్తానని జూబ్లీహిల్స్ ప్రజలకు తను సుపరిచితుడినేనని వాసు వడ్లూరి తెలిపారు.