వేద న్యూస్,  జమ్మికుంట:

ఉప్పల్ రైల్వే స్టేషన్ లో ప్రమాదవశాత్తు మరణించిన జమ్మికుంట స్టేషన్ మాస్టర్ జనగాం మహేష్ ఎస్ సి ఆర్ ఎం యు 100 రూపాయలు సభ్యత్వం కలిగి ఉన్నారు, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ, వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని మజ్దూర్ యూనియన్ వారు తెలిపారు.

ఎస్సీఆర్ఎంయు జనరల్ సెక్రటరీ కామ్రేడ్ సి.హెచ్. శంకర్ రావు ఆదేశాల మేరకు, జమ్మికుంట బ్రాంచ్ నాయకులు, ఘటనా స్థలానికి చేరుకుని, బాధిత కుటుంబానికి రూ. 2 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించి, అందులో భాగంగా ఆదివారం రూ.50 వేలు అందించారు.

అంత్యక్రియల నిమిత్తం సీసీఎస్ యాజమాన్యం రూ. 10 వేలు అందజేశారు. సికింద్రాబాద్ డివిజనల్ సెక్రటరీ కామ్రేడ్ పిల్లలమర్రి రవీందర్ మహేష్ కుటుంబానికి మజ్దూర్ యూనియన్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో జమ్మికుంట బ్రాంచ్ కార్యదర్శి బచ్చలి శ్రీనివాస్ బ్రాంచ్ చైర్మన్ ఉప్పుల రాజయ్య , బ్రాంచ్ ట్రెజరర్ ఎ.సాంబరాజు అసిస్టెంట్ సెక్రటరీ బి మొండయ్య ఎం.రవికుమార్ బ్రాంచి. వైస్ చైర్మన్లు జి. స్వప్న జి రాజేష్ ఈ. రమేష్. బ్రాంచ్ కన్వీనర్. పి.కుమారస్వామి కో కన్వీనర్ S.ప్రవీణ్ అశోక్ జగన్ రాజుకుమార్ పి రాజేందర్ తదితరులు పాల్గొనడం పాల్గొన్నారు.