• దళిత జర్నలిస్టుల ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ కట్కూరి ప్రసాద్

వేద న్యూస్, మరిపెడ:

రాష్ట్రంలో దళిత జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం స్పందించి పరిష్కరించాలని దళిత జర్నలిస్టుల ఐక్యవేదిక మహబూబాబాద్ జిల్లా కన్వీనర్ కట్కూరి ప్రసాద్ అన్నారు. మరిపెడ మండల కేంద్రంలో స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఆవరణంలో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో దళిత జర్నలిస్టులకు శిక్షణ శిబిరాలు పెట్టి సర్టిఫికెట్లు ఇచ్చి ఆర్థిక సహకారం అందించకుండా చేతుల్లో చేసిందని, దళిత బంధు విషయంలో దళిత జర్నలిస్టులను మభ్యపెట్టి మోసం చేసిందని ఆయన మండిపడ్డారు.

కాంగ్రెస్ ప్రభుత్వం లో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలలో దళిత జర్నలిస్టులకు ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు.

అంతేగాక సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత విలేకరులపై దాడులు దౌర్జన్యాలు పెరుగుతున్నాయని. తర్వాత కలిగిన వర్కింగ్ జర్నలిస్టు లందరికీ అక్రిడేషన్ కార్డులు అందించాలని కోరారు. 

 

దళిత జర్నలిస్టుఐక్యవేదిక మరిపెడ మండల కమిటీ ఎన్నిక..

అధ్యక్షులుగా: మెరుగు సంజీవ , ప్రధాన కార్యదర్శిగా: చింత వెంకన్న , కోశాధికారిగా: తప్పెట్ల సురేష్

దళిత జర్నలిస్టుల ఐక్యవేదిక మరిపెడ మండల నూతన కమిటీ జిల్లా కన్వీనర్ కట్కూరి ప్రసాద్, కో కన్వీనర్ జిన్నా లచ్చయ్య, అంబాల కుమారుల ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు.

గౌరవ అధ్యక్షులుగా వంకాయలపాటి తిరుమలరావు,నూతన అధ్యక్షులుగా మెరుగు సంజీవ, ప్రధాన కార్యదర్శిగా చింత వెంకన్న, కోశాధికారిగా తప్పెట్ల సురేష్, ఉపాధ్యక్షులుగా బి సోమన్న, సహాయ కార్యదర్శిగా గంగుల వెంకటేష్, కార్యవర్గ సభ్యులుగా పోస్ట్ వెంకన్న తదితరులు ఉన్నారు.

దళిత జర్నలిస్టుల ఐక్యత కోసం కృషి చేయాలన్నారు. త్వరలో జరగనున్న జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని ప్రసాద్ కోరారు.