- సీనియర్ సివిల్ జడ్జి టి నాగేశ్వరరావు
వేద న్యూస్ కోరుట్ల ప్రతినిధి:
మత్తు పదార్థాలకు బానిసగా మారి, నేటి యువత తమ విలువైన జీవితాల్ని చిత్తు చేసుకోవద్దని, డ్రగ్స్ పై కఠినవైఖరి అవలంభించా టిలని మెట్ పల్లి సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు అన్నారు. గురువారం మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ, మెట్ పల్లి ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మనోహర్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, వివిధ రకాల మాదక ద్రవ్యాలు విద్యార్థులకు అందుబాటులోకి రావడం దురదృష్టకరం అన్నారు. (మాదకద్రవ్యాల దుర్వినియోగ బాధితులకు చట్టపరమైన సేవలు మాదకద్రవ్యాల ముప్పు నిర్మూలన) 2015 పథకం నేటి యువతని రక్షించడం కోసం ప్రభుత్వం రూపొందించినప్పటికి దాని గూర్చి అవగాహన లేక నేటి విద్యార్థులు, యువత మత్తులో చిత్తవుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు.

పోలిసులు కూడా డ్రగ్స్ వాడకం మరియు విక్రయ ప్రాంతాలపై దృష్టి సారించి వ్యాపారులపై ఉక్కుపాదం మోపాలని సూచించారు. డ్రగ్స్ ఆకర్షణకు నేటి టీనేజ్ విద్యార్థులు దూరంగా ఉండి, చదువుపై మాత్రమే దృష్టి సారిస్తే భవిష్యత్తు బంగారు మయం అవుతుందన్నారు. అనంతరం పోలీస్ శాఖ రూపొందించిన వివిధ నినాదాలు గల పోస్టర్లని ఆయన ఆవిష్కరణ చేసారు.
ఈ కార్యక్రమం లో మెట్ పల్లి డియస్పి అట్లూరి రాములు, సీఐ అనిల్ కుమార్, ఎక్షయిజ్ సీఐ వినోద్ కుమార్, ఎస్సై కిరణ్ కుమార్, మండల విద్యా అధికారి మేకల చంద్రశేఖర్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు కంతి మోహన్ రెడ్డి , ఉపాధ్యక్షులు తోగిటి రాజశేఖర్,అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెర్లపల్లి ఆనంద్ గౌడ్, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ అబ్దుల్ హఫీజ్, బార్ అసోసియేషన్ సభ్యులు మరియు వివిధ పాఠశాలకు చెందిన దాదాపు 1000 మంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.