• దశదినకర్మకు హాజరైన ఓరుగల్లు జర్నలిస్టులు 

వేద న్యూస్, వరంగల్:

దివంగత సీనియర్ జర్నలిస్ట్, ది హన్స్ ఇండియా వరంగల్ బ్యూరో చీఫ్ ఆడెపు మహేందర్ దశదినకర్మ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఆరేపల్లి సమీపంలోని వీకే గార్డెన్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు, అధికారులు, బంధుమిత్రులు, సహచర జర్నలిస్టులు హాజరై మహేందర్ ఆత్మకు శాంతి చేకూరాలని శ్రద్ధాంజలి ఘటించారు.

ఈ కార్యక్రమంలో వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు, పూర్వ అధ్యక్షులు పిన్న శివకుమార్, గడ్డం కేశవమూర్తి, ఐజేయూ జిల్లా ప్రధాన కార్యదర్శి తోట సుధాకర్, పాత్రికేయులు గోకారపు శ్యాం, సిరిమల్లె సదానందం, సంపతి ప్రభాకర్, ఉస్నగిరి శ్రీకాంత్,తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేందర్ సతీమణి ఆడెపు లావణ్య, కుమారుడు సిద్ధార్థ్ లను పరామర్శించారు. మహేందర్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ పిన్న శివకుమార్ భావోద్వేగానికి గురయ్యారు. ఆయన కుటుంబానికి అండగా ఉంటామంటూ హామీ ఇచ్చారు.