ఎల్లారెడ్డిపేట వేద న్యూస్ : ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో పెద్ద ఎత్తున లంబాడ సోదరులు, సోదరీమణులు శీత్ల భవాని వేడుకలు ఘనంగా నిర్వహించారు,ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట సింగల్ విండో చైర్మన్ అలాగే జిల్లా రెడ్డి సంఘ అధ్యక్షులు గుండారం కృష్ణారెడ్డి పాల్గొని మాట్లాడుతూ అంతట వర్షాలు సమృద్ధిగా కురవాలని పాడి పంటలు సమృద్ధిగా పండాలని ప్రతి సంవత్సరం ఈ పండుగను జరుపుకోవడం సంతోషకరమని ఈ సందర్భంగా వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలోసూర్య నాయక్, కిరణ్ నాయక్, కళ్యాణ్ నాయక్, రాజు నాయక్, రవి నాయక్, హరి సింగ్ నాయక్, పెద్ద ఎత్తున లంబాడా సోదరులు పాల్గొన్నారు.