మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి
వేద న్యూస్, హన్మకొండ :
హన్మకొండ రాంనగర్ లోని నివాసంలో ముఖ్య మంత్రి సహాయం నిధి చెక్కులను లబ్ధిదారులకు 28లక్షల16వేయిల 600 రూపాయల విలువ గల చెక్కులను మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి మాట్లాడుతూ ఆపదలో ఉన్న ప్రజలకు ముఖ్య మంత్రి సహాయనిధి అండగా ఉంటుందని పేద ప్రజలకు ఎంతో ఉపయోగ పడుతుందని కొండా మురళి అన్నారు. పేద ప్రజలకు అండగా నిలిచిన ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వమని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స తీసుకొని ఎంతో ఇబ్బందులు పడి బయటకు వచ్చినకా ఆ పేద ప్రజలకు ప్రభుత్వం నుండి సహాయం అందేలా వారికి అండగా ఉండేందుకు గాను హాస్పటల్ అయిన ఖర్చులో 70 శాతం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా పేదలకు ఇవ్వడం జరుగుతుంది అని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి అన్నారు.