వేద న్యూస్, వరంగల్ టౌన్ :
క్షేత్ర స్థాయి లో పారిశుద్ధ్య సిబ్బంది పనితీరు పర్యవేక్షణ బాధ్యత జవాన్ల దే అని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. నగర పరిధి లోని 4,5,6 డివిజన్ ల పరిధి లోని టైలర్ స్ట్రీట్ కుమార్ పల్లి మార్కెట్ రెడ్డిపురం పెగడపల్లి డబ్బాలు ప్రాంతాల్లో గురువారం కమిషనర్ క్షేత్రస్థాయిలో పర్యటించి సానిటేషన్ నిర్వహి తీరును అధికారులను అడిగి తెలుసుకొని సమర్థవంతం గా నిర్వహించుటకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్ ను పరిశీలించిన కమిషనర్ హాజరు లో నమోదు చేసిన సిబ్బంది ఏరియా లో ఎక్కడ పని చేస్తున్నారో తనిఖీ చేశారు. ఏరియాలో ఎంత మంది జవాన్ లు విధులు నిర్వహిస్తున్నారు? జవాన్ లకు సిబ్బంది కి సమన్వయం ఉందా? లేదా? తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు.జవాన్ లకు సిబ్బంది విధులను నిరంతరం పర్యవేక్షించాలని స్వచ్చ ఆటో లు, ట్రాక్టర్ లు ప్రతి రోజు ఎన్ని ట్రిప్పులు వేస్తున్నారో పరిశీలించాలని ఆయా ప్రాంతాల్లో డ్రైన్ లను ఎన్ని సార్లు శుభ్రం చేస్తున్నారో అవగాహన ఉండాలని సిబ్బంది విధి నిర్వహణ విషయం లో తప్పుడు సమాచారం అందిస్తే సంబంధిత జవాన్ల ను సస్పెండ్ చేయడం జరుగుతుందని తెలిపారు. శానిటేషన్ తదుపరి ట్రేడ్ కలెక్షన్ వసూలు చేసే బాధ్యత జవాన్ల దే నని జవాన్ల కు కేటాయించిన డివిజన్ లలో 100 శాతం గృహాల నుండి చెత్త సేకరణ తడి పొడి చెత్త ను వేరు చేసి సేకరించాలని స్వచ్చ ఆటో లకు తడి పొడి చెత్త ను వేయడానికి వీలుగా వేరు వేరు.కంపార్ట్ మెంట్ లు ఉండాలని జవాన్ల కు కేటాయించిన ఏరియా లో ట్రేడ్ లైసెన్స్ లేకుండా దుకాణాలు నడిపితే సంబంధిత జవాన్ పెనాల్టీ చెల్లించాలని కమిషనర్ అన్నారు. ఈ కార్యక్రమంలో సి ఎం హెచ్ ఓ డా.రాజారెడ్డి, సానిటరీ సూపర్ వైజర్ నరేందర్, ఏఈ హరికుమార్, సానిటరీ ఇన్స్పెక్టర్ లు అనిల్, ప్రకాశ్, జవాన్ లు తదితరులు పాల్గొన్నారు.