వేద న్యూస్, హన్మకొండ:
స్థానిక సంస్థల ఎన్నికల ముందే ముదిరాజ్ లకు ఇచ్చిన రిజర్వేషన్ హామీని అమలు చేయాలని ముదిరాజ్ ఎంప్లాయిస్, ప్రొఫెషనల్స్ అసోషియేషన్ (మెపా) గోనెల విజేందర్ ముదిరాజ్ హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ముదిరాజ్‌లను బీసీ డీ నుంచి బీసీ ఏ లోకి మారుస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే విస్మరించిందని విమర్శించారు.బీసీలకు రాజకీయ పార్టీలు 42శాతం సీట్లు ఇవ్వడం కాదు.42శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించి అమలు చేయాలని పేర్కొన్నారు.మళ్ళీ బీసీ ప్రజలను మోసం చేసే కుట్ర చేస్తే స్థానిక ఎన్నికల్లో బీసీ లు కర్రు కాల్చి వాత పెడతారని హెచ్చరించారు.బీసీ ప్రజలారా..రాజకీయ పార్టీలు ఏ విధంగా మోసం చేస్తున్నాయో గమనించాలని విజ్ఞప్తి చేశారు.