వేద న్యూస్, వరంగల్ టౌన్:
తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక ఆధ్వర్యంలో ఈనెల 13వ తేదీన యుద్ధం ఎవరి కోసం అను అంశంపై జరిగే రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని కోరుతూ శుక్రవారం హనుమకొండలోని అంబేద్కర్ విగ్రహం వద్ద భాగస్వామ్య పార్టీల నాయకులు పోస్టర్ ను ఆవిష్కరించారు. వరంగల్ నగరంలోని
ఈనెల 13న ఎల్బీనగర్ లో ఉన్న అబ్నుస్ ఫంక్షన్ హాల్ లోమధ్యాహ్నం 12 గంటలకు సదస్సు ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ గ్రేటర్ వరంగల్ కమిటీ కార్యదర్శి రాచర్ల బాలరాజు మాట్లాడుతూ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత దేశాల మధ్య జరిగే యుద్ధాలు ఆ దేశ ప్రజల సమస్యలను సమస్యల పరిష్కారానికి మార్గంగా కనబడలేదని అన్నారు. లక్షలాదిమంది మరణించడం క్షతగాత్రులు కావడం ఆ దేశాల ఆర్థిక వ్యవస్థలు చిన్నభిన్నం అయ్యాయన్నారు. 1948 నుండి నేటి వరకు ఇజ్రాయిల్ పాలస్తీనా ప్రజలపై చేస్తున్న ఊచ కోత ఇందుకునిదర్శనం అన్నారు. అమెరికా దాని మిత్ర పక్షాలు ఆఫ్ఘనిస్తాన్ ఇరాక్ లాంటి దేశాలపై దాడులు చేసి ఆ దేశాల అభివృద్ధిని వంద సంవత్సరాలు వెనక్కు నెట్టి వేశాయని అన్నారు . నేడు రష్యా ఉక్రేయిన్ దేశాల మధ్య యుద్ధం అమెరికా పశ్చిమ దేశాల సృష్టిఅని ఆసియా ప్రాంతంలో ఆధిపత్యం కోసం ఇరాన్ పై ఇజ్రాయిల్ అమెరికా దేశాలు దాడులు చేస్తున్నాయని ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలకు నష్టకరమని ఆయుధ వ్యాపారం సైనిక ఒప్పందం ప్రపంచ ఆధిపత్యం కోసం అమెరికా దాని మిత్రదేశాలు పోటీ పడుతున్నాయని ఆయన అన్నారు. ఈ సదస్సుకు కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ వినాయక రెడ్డి అధ్యక్షత వహిస్తారని వక్తలుగా టిఎస్డిఎఫ్ రాష్ట్ర కన్వీనర్ జస్టిస్ చంద్రకుమార్, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి టి శ్రీనివాసరావు, ఇనాం సంస్థ జాతీయ అధ్యక్షులు కృష్ణ ప్రసాద్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి జే చలపతిరావు, ఎంసిపిఐయు రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, సిపిఐ ఎంఎల్ రాష్ట్ర నాయకులు గుర్రం విజయ్ కుమార్, ఆర్ఎస్పి రాష్ట్ర కార్యదర్శి జానకి రాములు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఆరెల్లి కృష్ణ, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ రాజా, భారత్ బచావో రాష్ట్ర నాయకులు వెంగల్ రెడ్డి, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ సోమిడి శ్రీనివాస్, టిఎస్డిఎఫ్ రాష్ట్ర నాయకులు నైనాల గోవర్ధన్ లు ప్రసంగిస్తారని వారు తెలిపారు. ప్రపంచ శాంతిని కాంక్షించే వివిధ వర్గాల ప్రజలు హాజరై జయప్రదం చేయాలని కోరారు.