వేద న్యూస్, కాజీపేట :

వరంగల్ పశ్చిమ నియోజకవర్గం, కాజీపేట పట్టణం 63వ డివిజన్లోని జూబ్లీ మార్కెట్ వడ్డెర కాలనీ లో శుక్రవారం ఇంద్రమ్మ లబ్ధిదారుల ఇంద్రమ్మ ఇల్లుకు 63వ డివిజన్ కార్పొరేటర్ విజయశ్రీ సయ్యద్ రజాలి ముగ్గు పోసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ విజయశ్రీ మాట్లాడుతూ నిరుపేదలకు సొంతింటి కలను నెరవేర్చిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, వరంగల్ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి కి తమ డివిజన్ ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఇంద్రమ్మ కమిటీ సభ్యులు ఆరూరి సాంబయ్య, డివిజన్ అధ్యక్షుడు పోగుల సంతోష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా ఎస్సీ సెల్ సెక్రెటరీ నదునూరి కుమారస్వామి, క్రాంతి, భరద్వాజ్, మహమ్మద్ షబ్బీర్, జిల్లా మైనార్టీ ప్రధాన కార్యదర్శి ముమ్మద్ బిలాల్, సయ్యద్ ఆసిఫ్, పల్లపు నవీన్, నర్సింగ్, శేఖర్, రాకేష్, సమ్మయ్య, స్వామి, తదితరులు పాల్గొన్నారు.