వేద న్యూస్, శాయంపేట:
శాయంపేట గ్రామం రైతు వేదిక లో భూపాలపల్లి నియోజక వర్గం (108) లోని హనుమకొండ జిల్లా శాయంపేట మండలం లో ఉన్న 42 పోలింగ్ బూత్ లకు బూత్ లెవల్ ఆఫీసర్స్ తో ముగ్గురు మాస్టర్ ట్రైనర్స్ తో జాతీయ స్థాయి శిక్షణ ఇవ్వడం జరిగినది అని శాయంపేట తహసిల్దార్ కలువాలా సత్యనారాయణ తెలిపారు.అలాగే బి ఎల్ ఓ లకు ప్రొజెక్టర్ ద్వారా ఫారం 6,7,8 ఫారాలను ఎలా ధృవీక రించాలి అనే విషయాలను శిక్షణ ఇవ్వడం జరిగినది. ఇట్టి శిక్షణలో మాస్టర్స్ ట్రైనర్ లు తిరుపతి, శ్రీనివాస్, నరేష్,ప్రభావతి , ఏ ఆర్ ఐ రమేష్, బి ఎల్ ఓ ల తో పాటు సూపర్ వైజర్స్ పాల్గొన్నారు.