వేద న్యూస్, మరిపెడ:

మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరిపెడ క్రీడా మైదానంలో శనివారం సీఎం కప్ ఆటల పోటీల ఎంపికలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలకు మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి వేణుగోపాల్ రెడ్డి చైర్మన్ గా , మండల విద్యాశాఖ అధికారి అనిత దేవి కన్వీనర్ గా ఉన్నారు.

క్రీడాపోటీల్లో భాగంగా అథ్లెటిక్స్, ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, కరాటే, చెస్, ఫుట్ బాల్ క్రీడలకు సెలక్షన్స్ నిర్వ హించినట్లు పాఠశాల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఈ. అనంతరావు, ఎంపీడీఓ ప్రతినిధి రామోజీ తెలిపారు.

శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే మానసిక ఆరోగ్యం ఉంటుంది అని చదువులోనైనా, చేసే పనులలోనైనా చురుకుగా ఉంటారని అన్నారు. తదుపరి క్రీడలలో ఎంపికైన క్రీడాకారులకు బహుమతి ప్రదానం చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు బయగాని రామ్మోహన్, సీఎం కప్ మరిపెడ మండల క్రీడల ఇంచార్జ్ రాజకుమారి, సీనియర్ పిడి వంగా రవి, ఇతర పిడీలు రమాదేవి, రాంబాబు, స్వప్న, శ్రీకాంత్, శివ, ఎంపీడీవో ఆఫీస్ రాజా మరియు క్రీడాకారులు పాల్గొన్నారు.