వేద న్యూస్, వరంగల్ టౌన్ :

వరంగల్ నగరంలోని 39వ డివిజన్ శాఖరాసి కుంట ఏకశిల కాలనీ వద్ద గత 18 సంవత్సరాల క్రితం నిర్మాణం చేసిన సెల్ టవర్ ను తొలగించాలంటూ స్థానిక మహిళలు గృహవాసులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెల్ టవర్ వల్ల రేడియేషన్ ఎక్కువై స్థానిక ప్రజలు రోగాల పాలవుతున్నారని, చాలామంది ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. వెంటనే సెల్ టవర్ తొలగించాలని డిమాండ్ చేశారు.

ఈ విషయమై వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో చాలాసార్లు ఫిర్యాదు కూడా చేశామని అయినా కూడా ఎవరు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా సెల్ టవర్ వద్ద జనరేటరు, బ్యాటరీలు ఇతర పరికరాలను అమర్చడానికి తీసుకురావడంతో వాటిని స్థానికులు అడ్డుకున్నారు. సెల్ టవర్ తీసేయాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వంచనగిరి కిషోర్, స్వప్న, కనుకుంట్ల కమటం వేణుగోపాల్, శ్రీమన్నారాయణ, గన్నోజు ప్రవీణ్, దేవులపల్లి నీలా, రావుల శ్రీనివాస్, స్రవంతి, భాగ్యలక్ష్మి, ఎండి అంజద్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *