వేద న్యూస్, వరంగల్.
జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం జిల్లా కలెక్టర్ డా. సత్య శారద గార్బేజ్ పికింగ్ స్టిక్ వినియోగంపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మన చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. గార్బేజ్ పికింగ్ స్టిక్ ఉపయోగించడం ద్వారా నేలపై ఉన్న ప్లాస్టిక్ బాటిళ్లు, కవర్లు, చిత్తుకాగితాలు వంటి చెత్తను ఎలాంటి ఇబ్బంది లేకుండా సులభంగా సేకరించవచ్చని పేర్కొన్నారు.
సేకరించిన చెత్తను సక్రమంగా భద్రపరచి రీసైక్లింగ్‌కు పంపించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడవచ్చని సూచించారు. అలాగే తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించడం కూడా సులభమవుతుందని తెలిపారు.

పరిశుభ్రమైన వాతావరణం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.

చెత్త ఎక్కువగా పోగయ్యే సంస్థలకు, ఎక్కువ మంది పనిచేసే ప్రాంగణాలకు, ఆసుపత్రులకు ఈ స్టిక్స్ చాలా ఉపయోగకరంగా ఉంటాయి అదరపు కలెక్టర్ లోకల్ బాడీ గణేష్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ జి. సంధ్యా రాణి, అదనపు కలెక్టర్ లోకల్ బాడీ వై వి గణేష్, జడ్పీ సీఈఓ రామ్ రెడ్డి, డిబిసిటీవో పుష్పలత తదితరులు ఉన్నారు.