వేద న్యూస్, హైదరాబాద్:

సీబీఎస్ఈ టెన్త్ ఫలితాల్లో సత్తా చాటిన స్టూడెంట్స్

అన్ని స్కూళ్లలో100 శాతం ఉత్తీర్ణత నమోదు

95 శాతానికి పైగా స్కోర్ చేసిన 237 మంది విద్యార్థులు

716 మంది స్టూడెంట్స్ 90 శాతానికి పైగా స్కోర్

విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్సీ మల్క కొమరయ్య

ప్రతిభా పురస్కారాలు అందజేసిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ

డీపీఎస్, పల్లవి విద్యాసంస్థల సీఈవో మల్క యశస్వి అభినందనలు

విద్యా ప్రమాణాల్లో మేటిగా నిలుస్తూ, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తున్న పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ మరో అద్భుత మైలురాయిని దాటాయి. తాజాగా వెలువడిన సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాల్లో పల్లవి, డీపీఎస్ విద్యార్థులు వందకు వంద శాతం ఉత్తీర్ణత సాధించి విజయ పరంపరను కొనసాగించారు. 237 మంది విద్యార్థులు 95 శాతానికి పైగా స్కోర్ చేశారు. 716 మంది స్టూడెంట్స్ 90 శాతానికి పైగా స్కోర్ చేశారు.1582 మంది విద్యార్థులు 80 శాతం స్కోర్ సాధించారు. 98 శాతం విద్యార్థులు 60 శాతానికి పైగా స్కోర్ చేయడం విశేషం. కాగా ప్రతిభ చాటిన విద్యార్థులకు సోమవారం బాగ్ లింగంపల్లిలోని టీజీఎస్ఆర్టీసీ కళ్యాణ మండపం ఆడిటోరియంలో ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ శాసనమండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్, డీపీఎస్ & పల్లవి గ్రూప్ విద్యాసంస్థల ఛైర్మన్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య, సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ, డీపీఎస్, పల్లవి విద్యాసంస్థల సీఈవో మల్క యశస్వి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ చాటిన విద్యార్థులను అభినందించి ప్రతిభా పురస్కారాలు అందజేశారు.

1. నాచారం డీపీఎస్ 100 శాతం
ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నాచారం క్యాంపస్ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా సీబీఎస్ఈ ఫలితాల్లో దుమ్మురేపింది. ఈ క్యాంపస్ లో మొత్తం 1214 మంది స్టూడెంట్స్ సీబీఎస్ఈ పదో తరగతి పరీక్ష రాయగా.. 740 మంది స్టూడెంట్స్ 60 శాతానికిపైగా స్కోర్ చేశారు. 253 మంది 90 శాతానికి పైగా స్కోర్ చేయగా.. 93 మంది స్టూడెంట్స్ 99 శాతం మార్కులు సాధించారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులను ప్రిన్సిపల్ తురగ పద్మ జ్యోతి అభినందించారు.
2. నాదర్ గుల్ డీపీఎస్ టాప్
ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నాదర్ గుల్ క్యాంపస్ విద్యార్థులు సత్తా చాటారు. ఇక్కడ మొత్తం 740 మంది స్టూడెంట్స్ టెన్త్ పరీక్ష రాస్తే.. ఇందులో 735 మంది 60 శాతానికి పైగా స్కోర్ చేయడం విశేషం. 120 మంది స్టూడెంట్స్ 90 శాతానికి పైగా స్కోర్ సాధిస్తే.. 41 మంది విద్యార్థులు 99 శాతం స్కోర్ చేసి అబ్బురపరిచారు. ఈ సందర్భంగా ప్రతిభచాటిన విద్యార్థులను ప్రిన్సిపల్ డా. అనుపమ సక్సేనా ప్రత్యేకంగా అభినందించారు.
3. మహేంద్రహిల్స్ డీపీఎస్
ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మహేంద్రహిల్స్ క్యాంపస్ స్టూడెంట్స్ పదో తరగతి ఫలితాల్లో మంచి ప్రతిభ కనబరిచారు. ఇక్కడ మొత్తం 134 మంది స్టూడెంట్స్ పరీక్ష రాస్తే అందరూ 60 శాతానికి పైగా స్కోర్ చేశారు. 54 మంది 90 శాతానికి పైగా, 16 మంది 98 శాతం ఫలితాలు సాధించి ఔరా అనిపించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ప్రిన్సిపల్ నందిత సుంకర ప్రత్యేకంగా అభినందించారు.
4. పల్లవి బోడుప్పల్
పల్లవి బోడుప్పల్ స్టూడెంట్స్ సీబీఎస్ఈ టెన్త్ ఫలితాల్లో ప్రతిభ కనబరిచారు. ఇక్కడ మొత్తం 258 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా.. 249 మంది స్టూడెంట్స్ 60 శాతానికి పైగా స్కోర్ చేశారు. 57 మంది 90 శాతానికిపైగా, 20 మంది 99 శాతం స్కోర్ చేసి సత్తా చాటారు. విద్యార్థులను తనూజ అభినందించారు.
5. పల్లవి అల్వాల్ క్యాంపస్
పల్లవి స్కూల్ అల్వాల్ క్యాంపస్ స్టూడెంట్స్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఇక్కడ మొత్తం 301 మంది స్టూడెంట్స్ పరీక్ష రాయగా.. అందులో 294 మంది 60 శాతానికి పైగా స్కోర్ చేశారు. 57 మంది 90 శాతానికి పైగా, 27 మంది 99 శాతం మార్కులు స్కోర్ చేశారు. ఈ సందర్భంగా సత్తా చాటిన విద్యార్థులను ప్రిన్సిపల్ ఏఎస్ విద్యాధరి అభినందించారు.
6. పల్లవి బోయిన్ పల్లి క్యాంపస్
పల్లవి బోయిన్ పల్లి క్యాంపస్ స్టూడెంట్స్ సీబీఎస్ఈ టెన్త్ ఫలితాల్లో ప్రతిభ కనబరిచారు. ఇక్కడ మొత్తం 259 మంది పరీక్షకు హాజరవగా 253(97%) మంది 60 శాతానికిపైగా స్కోర్ చేశారు. 69 మంది స్టూడెంట్స్ 90 శాతానికిపైగా, 21 మంది స్టూడెంట్స్ 98 శాతం స్కోర్ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ప్రిన్సిపల్ డా. రాజేశ్ అభినందించారు.
7. పల్లవి గండిపేట్ క్యాంపస్
పల్లవి గండిపేట్ స్కూల్ క్యాంపస్ స్టూడెంట్స్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఇక్కడ 135 మంది పరీక్ష రాయగా.. 134 మంది అంటే 99 శాతం స్టూడెంట్స్ 60 శాతానికిపైగా స్కోర్ చేశారు. 36 మంది 90 శాతానికి పైగా, 8 మంది స్టూడెంట్స్ 98 శాతం స్కోర్ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ప్రిన్సిపల్ హేమ ప్రత్యేకంగా అభినందించారు.
8. పల్లవి కీసర క్యాంపస్
పల్లవి కీసర స్కూల్ క్యాంపస్ స్టూడెంట్స్ సత్తా చాటారు. ఇక్కడ మొత్తం 83 మంది పరీక్ష రాయగా.. 78 మంది 60 శాతానికిపైగా స్కోర్ చేశారు. 12 మంది 90 శాతానికి పైగా, ఆరుగురు స్టూడెంట్స్ 98 శాతం స్కోర్ సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ప్రిన్సిపల్ శ్రీలత ప్రత్యేకంగా అభినందించారు.
9. పల్లవి సరూర్ నగర్ క్యాంపస్
పల్లవి సరూర్ నగర్ స్కూల్ క్యాంపస్ స్టూడెంట్స్ సత్తా చాటారు. ఇక్కడ మొత్తం 64 మంది పరీక్ష రాయగా.. ఇందులో 63 మంది అంటే 99 శాతం స్టూడెంట్స్ 60 శాతానికిపైగా స్కోర్ చేశారు. 12 మంది 90 శాతానికిపైగా, నలుగురు స్టూడెంట్స్ 97 శాతం స్కోర్ సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ప్రిన్సిపల్ డి.కిరణ్మయి ప్రత్యేకంగా అభినందించారు.
10. అక్షర వాగ్దేవి క్యాంపస్
అక్షర వాగ్దేవి ఇంటర్నేషనల్ స్కూల్ స్టూడెంట్స్ కూడా అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఇక్కడ మొత్తం 77 మంది పరీక్ష రాయగా.. 74 మంది 60 శాతానికిపైగా స్కోర్ చేశారు. 14 మంది 90 శాతానికిపైగా, ఒకరు 97 శాతం స్కోర్ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ప్రిన్సిపల్ అభినందించారు.