వేద న్యూస్, రుద్రూర్:
స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా రుద్రూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇందూరి సునీత -చంద్రశేఖర్ సర్పంచ్ బరిలో నిలిచారు. ఈ సందర్భంగా శుక్రవారం ఇంటింటా తిరుగుతూ జోరుగా ప్రచారం నిర్వహించారు. బ్యాలెట్ పత్రాలను చూయిస్తూ ఉంగరం గుర్తుకు అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.