• సేవామార్గంలో ముందుకు..
  • వెంకటేశ్వర్ల పల్లెలో ఉచిత వైద్య శిబిరం
  •  ఆదిత్య, అమృత ఆస్పత్రుల ఆధ్వర్యంలో

వేద న్యూస్ , జమ్మికుంట:

జమ్మికుంట మండలం వెంకటేశ్వర్ల పల్లె గ్రామంలో బుధవారం జమ్మికుంట ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, అమృత హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.

ఈ శిబిరంలో ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ ఆకుల శ్రీనివాస్ (జనరల్ మెడిసిన్), డాక్టర్ మహిపాల్ (జనరల్ సర్జన్), డాక్టర్ భరత్ (న్యూరాలజిస్ట్), డాక్టర్ గ్రీష్మ (గైనకాలజిస్ట్) పాల్గొని గ్రామస్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.

రోగులకు ఉచితంగా షుగర్ పరీక్షలు నిర్వహించడంతో పాటు, వైద్యుల సూచన మేరకు అవసరమైన మందులను ఉచితంగా అందజేశారు.ఈ సందర్భంగా ఆదిత్య , అమృత హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఎలుక దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని పేద, నిరుపేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

రాబోయే రోజుల్లో మరిన్ని గ్రామాల్లో ఇటువంటి వైద్య శిబిరాలను విస్తృతంగా నిర్వహించి, అవసరమైన వైద్య సేవలను ప్రజలకు చేరువ చేస్తామని పేర్కొన్నారు.వైద్య శిబిరానికి అవకాశం కల్పించి సహకరించిన గ్రామ సర్పంచ్ పోల్సాని వినోద-నారాయణరావు, ఉప సర్పంచ్ రేబెల్లి వెంకటేష్, పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలకు హాస్పిటల్ యాజమాన్యం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.