వేదన్యూస్ కరీంనగర్

నా ఉద్యోగం తిరిగి ఇవ్వకపోతే నిరహార దీక్ష చేస్తానంటూ ఆర్టీసీ కండక్టర్ ఆవేదన

కరీంనగర్ రీజియన్ కోరుట్ల డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తూ, అనారోగ్యం కారణంగా పికెట్ డిపోకు బదిలీ చేయించుకున్న అంజయ్య

ఈ ఏడాది జనవరి 28వ తేదీన మేడారంలో జాతరలో ఆర్టీసీ కార్మికుల ఇబ్బందులు మీడియాతో చెప్పినందుకు, ఫిబ్రవరి 24వ తేదీ నుండి పికెట్ డిపో మేనేజర్ తనకు డ్యూటీ వేయలేదని, అనంతరం మార్చి 10వ తేదీన తిరిగి కరీంనగర్ రీజియన్‌కు వెళ్లిపోవాలని లెటర్ ఇచ్చాడని తెలిపిన బాధితుడు

అయితే కరీంనగర్ రీజియన్‌లో ఏ డిపోలో డ్యూటీ చేయాలో రీజినల్ మేనేజర్ ఇప్పటి వరకు తనకు చెప్పలేదని, దీంతో ఇన్ని నెలల నుండి జీతం లేకుండా ఉన్నానని బాధితుడి ఆవేదన

తన భార్యకు కంటి సర్జరీ కోసం తార్నాక ఆర్టీసీ ఆసుపత్రిలో చేర్పించానని, అక్కడి సిబ్బంది తాను పని చేసే డిపో నుండి లెటర్ తేవాలని అడుగుతున్నారని, ఇప్పుడు లెటర్ ఎక్కడినుండి తేవాలని ఆగ్రహం వ్యక్తం చేసిన బాధితుడు

ఇప్పటికైనా ఆర్టీసీ యాజమాన్యం స్పందించి తనకు ఉద్యోగం ఇవ్వకపోతే బస్ భవన్ ఎదుట నిరహార దీక్షకు దిగుతానని హెచ్చరించిన అంజయ్య