వేదన్యూస్ వరంగల్ జిల్లా
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ ప్రణాళిక లో మహిళా వారోత్సవాలలో భాగంగా ఖిలా వరంగల్ మండలంలోని పుప్పాలగుట్ట పీహెచ్‌సీలో నిర్వహించిన స్క్రీనింగ్ క్యాంప్‌ను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సోమవారం సందర్శించారు.
ఈ సందర్శన లో అదనపు కలెక్టర్ జి. సంధ్యారాణితో కలిసి క్యాంపులో నిర్వహిస్తున్న ఆరోగ్య పరీక్షలు, వైద్య సేవలను పరిశీలించారు.
మహిళల ఆరోగ్య సంరక్షణ అత్యంత ముఖ్యమని పేర్కొంటూ, ప్రతి మహిళ క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
ప్రత్యేకించి గ్రామీణ ప్రాంత మహిళల్లో ఆరోగ్యంపై అవగాహన పెంచాలని, వ్యాధులను ముందస్తుగా గుర్తించి చికిత్స అందించేలా స్క్రీనింగ్ క్యాంపులను సమర్థవంతంగా నిర్వహించాలని వైద్య అధికారులను ఆదేశించారు.
మహిళలకు అవసరమైన వైద్య సేవలు, మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సంక్షేమ శాఖ అధికారి రాజమణి,, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సాంబశివ రావు, ఖిలా వరంగల్ తహసిల్దార్ ఇక్బాల్, సంబంధిత అధికారులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.