వేద న్యూస్ ఆంద్రప్రదేశ్ : 

గ్రామ పంచాయతీల్లో ఆస్తి పన్ను చెల్లించేవారికి ప్రభుత్వం 5శాతం రాయితీ ఆఫర్ ప్రకటించింది. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆస్తి పన్నును వచ్చే ఏడాది మార్చి వరకు చెల్లించవచ్చు. అయితే మే 1 నుంచి 31 లోపు చెల్లించేవారికి ఈ రాయితీ వర్తించనుంది. స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారా ట్యాక్స్ కట్టొచ్చు. ఈ ఆఫర్ను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.