వేద న్యూస్, రుద్రూర్: 

నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా రుద్రూర్ గ్రామానికి చెందిన సీనియర్ నాయకుడు పత్తి రాము నియామకం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన సంతోషం వ్యక్తం చేస్తూ, తనపై నమ్మకంతో జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు అప్పజెప్పినందుకు ఆయన అధిష్టానానికి కృతజ్ఞతలు తెలియజేశారు.