వేద న్యూస్, ఇబ్రహీంపట్నం :
ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామంలో గ్రామ శివారులో గల శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉదయం నుండి భక్తులు భక్తిశ్రద్దలతో భారీ ఎత్తున పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా ఎస్సై జి నవీన్ కుమార్ కి సర్పంచ్ వెంకట్, శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఎస్సై జి నవీన్ కుమార్, స్వామి వారి పూజలో పాల్గొన్నారు.సాయంకాల సమయంలో స్వామి వారి రథోత్సవ శోభాయాత్ర పురాతన శ్రీ వేంకటేశ్వర ఆలయం నుండి మేళ తాళాలు మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ సందర్బంగా ఆలయ అర్చకులు,గ్రామ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గ్రామ శివారు గుట్టలో స్వయంభుగా వెలిసిన శ్రీ లక్ష్మి వెంకటేశ్వరా స్వామి వారిని భక్తులు అధిక సంఖ్యలో వస్తు పూజలు నిర్వహిస్తారని తెలిపారు.
అలాగే కోరిన కోరికేలు తీర్చే కొంగుబంగరంగా కొలువైన శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి దర్శనార్థం చుట్టూ పక్కల గ్రామల నుండి ఆదిక సంఖ్యలో భక్తులు వస్తారని తెలిపారు.భక్తులు ఆలయం చుట్టూ తిరుగుతూ గోవిందా గోవిందా స్మరణతో మొక్కలు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, గ్రామ కమిటీ సభ్యులు, భక్తులు, నాయకులు, యూవకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
