- జైత్ పూర్ సర్పంచ్ అభ్యర్థి కోలే జ్యోతి
- నామినేషన్ దాఖలు
వేద న్యూస్, ఆసిఫాబాద్ ప్రతినిధి:
స్థానిక సంస్థల ఎన్నికలలో తనను సర్పంచ్ గా గెలిపించి అవకాశం ఇస్తే జైత్ పూర్ గ్రామ పంచాయతీనీ అభివృద్ధి చేస్తానని జైత్ పూర్ సర్పంచ్ అభ్యర్థి కోలే జ్యోతి అన్నారు. శనివారం తన అనుచరులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సర్పంచ్ గా తనకి అవకాశం ఇస్తే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని గ్రామ పంచాయతీని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఆదర్శ పంచాయతీ గా తీర్చి దిద్దుతామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కొలె పత్రు, కొట సరిత, చౌదరి కవిత, జబొరె మహేష్ తదితరులు పాల్గొన్నారు.
వార్డు మెంబర్ గా జబొరె మహేష్ నామినేషన్
జైత్ పూర్ గ్రామ పంచాయతీలోని 4 వ వార్డు సభ్యుడిగా గ్రామానికి చెందిన యువ నాయకుడు జబొరె మహేష్ శనివారం నామినేషన్ దాఖలు చేశారు. ఆయన మాట్లాడుతూ యువకుడైన తనను వార్డు సభ్యుడిగా గెలిపించాలని కోరాడు.
