• నామినేషన్ దాఖలు చేసిన లక్ష్మయ్య

వేద న్యూస్, వరంగల్:

జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం, మోరంచపల్లి గ్రామ పంచాయతీలో 2వ వార్డు కు గాను వార్డు మెంబర్ గా పోటీకి ఇంజపెల్లి లక్ష్మయ్య బరిలో నిలిచారు. ఆదివారం ఆయన గ్రామ పంచాయతీ కార్యాలయంలో 2 వ వార్డు సభ్యుడిగా పోటీకి నామినేషన్ దాఖలు చేశారు.

ముగ్గురు పిల్లల నిబంధనను తొలగించడంతో ఈ అవకాశం రావడం జరిగినదని, కావున ప్రజలకు సేవ చేయుటకు గాను తనను ఆశీర్వదించాలని ప్రజలను లక్ష్మయ్య కోరారు.  ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తాను ముందుకు సాగుతానని, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని, వార్డు ప్రజల శ్రేయస్సుకు కృషి చేస్తానని చెప్పారు.

తన వార్డు తో పాటు మోరంచపల్లి గ్రామ ప్రజలకు సంబంధించిన సమస్యలను గ్రామ సభలో వినిపిస్తానని, అధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లి పరిష్కరిస్తానని పేర్కొన్నారు.