• ప్రజాసమస్యల పరిష్కారానికి ముందుండే ప్రథమ పౌరుడిగా నన్ను ఆశీర్వదించండి: సందీప్

వేద న్యూస్, హన్మకొండ:

హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల పరిధిలోని దేవునూరు గ్రామ సర్పంచ్‌గా బరిలోకి యువనేత దిగారు. ఆదివారం దేవునూరు గ్రామ వాసి, యువకుడు, విద్యావంతుడు, సమస్యలపై అవగాహన ఉన్న కొంగంటి సందీప్ నామినేషన్ దాఖలు చేశారు. 

ఈ సందర్భంగా సందీప్ కొంగంటి మాట్లాడుతూ.. గ్రామ ప్రథమ పౌరుడిగా ఉండే వ్యక్తి సమస్యలపై అవగాహన కలిగి ఉండి.. వాటి పరిష్కారానికి కృషి చేసే వారు అయి ఉంటేనే బాగుంటుందని పేర్కొన్నారు. 

గ్రామ అభివృద్ధి విషయంలో అందరి మద్దతుతో ముందుకు సాగుతూ.. అభివృద్ధి పథంలో ఊరు ఉండేలా తాను కృషి చేస్తానని పేర్కొన్నారు. గతంలో పలు విషయాలపై అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి సామాన్యుడిగా, ఊరివాసిగా తాను తన వంతు కృషి చేశానని వెల్లడించారు.

గ్రామ సర్పంచ్(ప్రథమ పౌరుడి)గా తనను ఎన్నుకుంటే.. శక్తి వంచన లేకుండా ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతానని సందీప్ వెల్లడించారు. ప్రజాక్షేత్రంలో బరిలోకి దిగిన తనను ఆశీర్వదించాలని దేవునూరు గ్రామ ప్రజలన సందీప్ వినమ్రంగా అభ్యర్థించారు. 

ప్రజలు తమ ఓటును సమస్యలు పరిష్కరించే వారికి మాత్రమే వేయాలని వేడుకున్నారు. విద్యావంతుడైన తాను సమస్యల పరిష్కారం, గ్రామ అభివృద్ధి, యువతకు అవకాశాలు తో పాటు అన్ని విషయాలలో సాధ్యమైన మేరకు తనకు సర్పంచ్ గా  అవకాశం ఇస్తే.. చిత్తశుద్ధితో పని చేస్తానని చెప్పారు. గ్రామ సర్పంచ్ గా ఊరిని అభివృద్ధి పథంలో తీసుకెళ్లే నాయకుడిగా ముందుకెళ్తానని సందీప్ కొంగంటి స్పష్టం చేశారు.