ఐపీఎల్ -2025సీజన్ లో భాగంగా పంజాబ్ సూపర్ కింగ్స్ జట్టుతో జరుగుతున్న తాజా మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు పూర్తి ఓవర్లు ఆడి 4వికెట్లను కోల్పోయి 205పరుగులు చేసింది.
రాజస్థాన్ జట్టులో బ్యాటర్ యశస్వీ జైస్వాల్ భీకర పామ్ లోకి వచ్చాడు. వచ్చి రావడంతో 3ఫోర్లు , 5 సిక్సర్ల సాయంతో 45 బంతుల్లో 67 పరుగులు చేశాడు.
మరోవైపు కెప్టెన్ సంజూ శాంసన్ 38 పరుగులు , హెట్మెయర్ 20, నితీశ్ రాణా 12, ధ్రువ్ జురెల్ 13 (నాటౌట్),రియాన్ పరాగ్ 43 పరుగులతో రాణించడంతో ఆర్ఆర్ భారీ స్కోరును సాధించింది. పంజాబ్ బౌలర్లల్లో లాకీ పెర్గూసన్ 37/2, అర్షదీప్ 35/1, జాన్సన్ 45/1 లు రాణించారు.