వేద న్యూస్, బోయినిపల్లి:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కోదురుపాక గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కత్తేరపాక మంజుల సుధాకర్, నామినేషన్ వేయడం జరిగింది. అనంతరం కత్తేరపాక మంజుల సుధాకర్, మాట్లాడుతూ కోదురుపాక గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి మహిళా యువశక్తిగా, ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకగా,
సర్పంచ్ అభ్యర్థిగా నేను మీ ముందుకు వచ్చాను. నాకు ఒక అవకాశం ఇచ్చి నన్ను అధిక మెజారిటీతో గెలిపించాలని కోదురుపాక గ్రామ ప్రజలను కోరారు. అలాగే వార్డు మెంబెర్స్ కూడా నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమం లో గ్రామ ప్రజలు, యువకులు, తదితరులు, పాల్గొన్నారు.