Mohammed Shami Indian cricketer

వేదన్యూస్ -యూపీ

వినడానికి వింతగా ఉన్న ఇదే నిజం.. అన్న ఏమో ప్రపంచ క్రికెట్ ను శాసించే టీమిండియా జట్టుకు ప్రధాన బౌలర్. అంతేకాదు ఇటీవల జరిగిన ఐపీఎల్ అక్షన్ లో సైతం పది కోట్ల రూపాయలకు సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ కు అమ్ముడుపోయిన ఆటగాడు. అయితేనేమి అతని సోదరి షబీనా మాత్రం సామాన్యురాలి లెక్క ఉపాధి హామీ పథకంలో కూలీగా పేరు నమోదు చేసుకుంది.

తప్పు ఏముంది..?. పని చేసుకోవడం తప్పా..?. ఏదైన స్కామో కుంభకోణమో చేయడమో తప్పు కానీ అనుకుంటున్నారు. అయితే మీరక్కడే పప్పులో కాలేశారు. అసలు విషయం ఏంటంటే షమీ సోదరీ అత్త గులె ఆయేషా యూపీలోని ఆమ్రోరా అనే గ్రామానికి చెందిన పెద్ద. ఆ గ్రామంలో జరిగిన ఉపాధి హామీ పథకంలో తన కోడలైన షమీ సోదరి పేరు.. ఆమె భర్త పేరును రాయించారు. అయితే పేర్లు అయితే రాయించారు కానీ ఏ ఒక్క రోజు కూడా పనికి పోలేదు. పనికిపోకుండానే డబ్బులు తీసుకున్నారని ఆరోపణ. దీనిపై ప్రస్తుతం విచారణ జరుగుతుంది. ఇదన్నమాట అసలు ముచ్చట.

ఇది యూపీలోనే జరిగిన అతిపెద్ద కుంభకోణం. 2021-24 మధ్యలో ఈ కుంభకోణంలో దాదాపు పద్దెనిమిది మంది జీతాలు తీసుకున్నట్లు తెలుస్తుంది. వీరిలో షమీ సోదరి షబీనా, ఆమె భర్త ఘజ్నావి,అతడి సోదరులు ఆమిర్ సుహైల్, నస్రుద్దీన్, షేఖు ఉన్నారని స్థానిక జిల్లా  కలెక్టర్ చెప్పడం విశేషం.