వేద న్యూస్ ,వరంగల్ :

ఖిలా వరంగల్ మండలం 17వ డివిజన్ బొల్లికుంట గ్రామంలో చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన చేసేందుకు శుక్రవారం భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వరంగల్ జిల్లా బిజెపి అధ్యక్షుడు గంట రవికుమార్, 17వ డివిజన్ కార్పొరేటర్ గద్దె బాబు, 44వ డివిజన్ కార్పొరేటర్ జలగం రంజిత్, హిందూ వాహిని సంయోజక్ ఎర్రగోల ఛత్రపతి శివాజీ, దొంతి దేవేందర్ రెడ్డి ముఖ్యఅతిధిగా హాజరై భూమిపూజ చేశారు. హనుమాన్ జయంతి వరకు విగ్రహ ప్రతిష్టాపన పూర్తిచేస్తామని హిందూ యువత తెలిపారు. ఈ కార్యక్రమాన్ని వేద పండితులు వేణుగోపాల్ ఆధ్వర్యంలో పూజాకార్యక్రమాలు నిర్వహించారు. బొల్లికుంట అన్ని పార్టీల నాయకులు , గ్రామ పెద్దలు, మహిళలు, చత్రపతి శివాజీ యువసేన బొల్లికుంట టీం సభ్యులు పాల్గొన్నారు.