వేద న్యూస్, హనుమకొండ :

 

ర్యాగింగ్ చట్టరీత్యా నేరం, ర్యాగింగ్ కి పాల్పడిన వారిని క్షమించే ప్రసక్తి లేదు, ర్యాగింగ్ కి పాల్పడి విద్యార్థులు జీవితాలని నాశనము చేసుకోవద్దు, తల్లిదండ్రులు, కళాశాలల యాజమాన్యం పిల్లల మానసిక ప్రవర్తన పై నిఘా ఉంచవలసిన అవసరం ఉంది, తోటి వారిని బాధపెట్టి సంతోషపడడం అనేది మానసిక వైకల్యం అని ఆంటీ ర్యాగింగ్ కమిటీ మెంబర్, అనురాగ్ సొసైటీ చైర్మన్,కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులు డాక్టర్ అనితా రెడ్డి అన్నారు. ఇటీవల కొన్ని కళాశాలలో జరిగిన సంఘటనలో చర్యలు తీసుకున్నామని, ఇప్పుడు అవి పునరావృతం కాకుండా జాగ్రత్తలు సైతం తీసికొని, ర్యాగింగ్ చట్టం పై అవగాహనా కార్యక్రమాలు మరింత నిర్వహించాలను కుంటున్నామని అన్నారు. రాగింగ్ కి పాల్పడితే చట్టపరమైన శిక్షలు తప్పవని, రాగింగ్ మానసిక, శారీరక, ఎమోషనల్ గా లేదా ఇంకేరకంగా ఇతరులను ఇబ్బంది పెట్టినా రాగింగ్ కిందకే వస్తుందని తెలిపారు. ప్రతి కాలేజీ లో ఆంటీ రాగింగ్ కమిటీ, కమిటీలను ఏర్పాటు చేయాలని , ఆ కమిటీ లోని వారి పేర్లు,సెల్ నెంబర్లు కాలేజీ ఆవరణలో డిస్ప్లే చేయాలని అన్నారు, పిల్లలు ఏ ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆంటీ ర్యాగింగ్ కమిటీ కి లేదా 100 కి ఫిర్యాదు చేయాలని డాక్టర్ అనితా రెడ్డి అన్నారు.