వేద న్యూస్, చందుర్తి:

 

చందుర్తి మండలంలోని దేవుని తండా గ్రామానికి చెందిన నందిని అనే అమ్మాయి సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ హైదరాబాద్లో చదువుతుంది.వివరాల్లోకి వెళ్తే మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్న నందిని అనే విద్యార్థిని నారపల్లిలోని ప్రైవేట్ హాస్టల్లో ఉంటుంది.తన గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు హాస్టల్ యజమాని పేర్కొన్నారు. హాస్టల్ యజమాని ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు మేడిపల్లి పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.