వరంగల్: ఖిలా వరంగల్ మండలంలోని GHS రైల్వే గేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అండర్-14 విభాగంలో రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికయ్యారు. బాలుర విభాగంలో రెహాన్, బాలికల విభాగంలో ఆయేషా జిల్లా స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి లో సెప్టెంబర్ 12, 13, 14 తేదీల్లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికయ్యారు.
ఈ సందర్భంగా పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్ మాట్లాడుతూ
విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలను పెంపొందిస్తూ వారిని రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించేలా తీర్చిదిద్దడంలో పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ సృజన గారు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. పాఠశాల అభివృద్ధికి కూడా ఆమె అందిస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు.
హనుమకొండ జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు పెరుమండ్ల సాంబమూర్తి మాట్లాడుతూ
సెప్టెంబర్ 3న JNS స్టేడియంలో నిర్వహించిన జిల్లా స్థాయి సెలెక్షన్స్‌లో సుమారు 300 మంది క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు. క్రీడల ద్వారా విద్యార్థులకు మానసిక ఉల్లాసంతో పాటు చదువు పై కూడా మంచి ప్రేరణ లభిస్తుందని అన్నారు.
రాష్ట్రస్థాయి పోటీల్లో విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు కూడా ఎంపిక కావాలని ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్ ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొని ఎంపికైన విద్యార్థులను అభినందించారు.
