వేదన్యూస్ తెలంగాణ :
భానుడి భగభగలకు తెలంగాణ అగ్నిగుండంలా మారింది. బుధవారం దాదాపు 19 జిల్లాల్లో 46+ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే వివిధ ప్రాంతాల్లో నిన్న ఒక్కరోజే వడదెబ్బకు గురై 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ఆరుగురు మృతి చెందడం గమనార్హం. మరో నాలుగైదు రోజులు ఎండల తీవ్రత ఉంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఖమ్మం, నల్గొండ, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.