వేదన్యూస్ తెలంగాణ
తెలంగాణ రాష్ట్రంలో యూరియా విషయంలో కేంద్రం ఇబ్బందిపెడితే ఊరుకోమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎరువుల కోసం రైతుల పక్షాన పోరాడతామని, కాంగ్రెస్ ఎంపీలతో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ధాన్యం కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వానిదన్నారు. పెరిగిన ఇంధన ధరలను పక్కదారి పట్టించేందుకే రాష్ట్ర బీజేపీ నేతలు యాత్రలు చేస్తున్నారని విమర్శించారు.