నాగ్సన్ పల్లి ఉమా కేదారేశ్వర స్వామీ ఆలయంలో ప్రత్యేక పూజలు

వేద న్యూస్ పాపన్నపేట రిపోర్టర్ దయానంద్

పాపన్నపేట మండల పరిధిలోని నాగుసానిపల్లి గ్రామంలోనీ శ్రీఉమా కేదారేశ్వర క్షేత్రం ఆలయంలో గురువారం రోజు రంగంపేట పీఠాధిపతి శ్రీశ్రీశ్రీమాధవ నంద సరస్వతీ స్వామి వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా స్వామి వారు మాట్లాడుతూ పరమాత్ముడి సేవకు మించిన సేవ మరొకటి లేదన్నారు.ప్రతినిత్యం భగవంతుని పూజించడం వల్ల మనకు ఆ భగవంతుడి కృప మనపై ఉంటుందన్నారు.భక్తులు పెద్ద ఎత్తున ఆలయంలో పూజలు నిర్వహించారు. స్వామివారికి యాబన్న గుప్తా దంపతులు పాదపూజ చేశారు.ఈ కార్యక్రమంలో అర్చకులు రాజశేఖర్ శర్మ, శ్యాంసుందర్ శర్మ,రామ్ శర్మ,రఘు శర్మ,పార్ష నర్సింలు గుప్తా, ఇంద్రసేనారెడ్డి,పార్శ శ్రీనివాస్,మోహన్ రెడ్డి, మాధవరెడ్డి,ఎర్రం రవీందర్,బెజగం రవీందర్, పల్లె సాయిబాబా, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *