*క్రీడల్లో మెరిసిన పాపన్నపేట్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు*

*సాఫ్ట్‌బాల్, వాలీబాల్ విభాగాల్లో సత్తా చాటిన యువ క్రీడాకారులు*

*రాష్ట్రస్థాయి పోటీలకు ఇద్దరు విద్యార్థుల ఎంపిక*

*విద్యార్థులను అభినందించిన ప్రిన్సిపాల్, నర్సింలు*

వేద న్యూస్, పాపన్నపేట

పాపన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు క్రీడల్లో తమ ప్రతిభను చాటుకుని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ (SGF) ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంపిక పోటీల్లో వీరు ఉత్తమ ప్రదర్శన కనబరిచారు.
కళాశాలలో ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న దేవా సూత్ నరేష్ సాఫ్ట్‌బాల్ విభాగంలో, బైపీసీ ద్వితీయ సంవత్సరం విద్యార్థి జి. యువరాజ్ వాలీబాల్ విభాగంలో రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారు. గ్రామీణ ప్రాంత కళాశాల నుంచి ఇద్దరు విద్యార్థులు రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ నర్సింలు , స్టూడెంట్ కౌన్సిలర్ మరియు స్పోర్ట్స్ ఇన్‌ఛార్జ్ సంతోష్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించడం విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తుందని అన్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ ఇదే స్ఫూర్తితో ఆడి కళాశాలకు, మెదక్ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం, అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొని క్రీడాకారులకు అభినందించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *