- ప్రమాదవశాత్తూ నీట మునిగి వ్యక్తి మృతి…
వేద న్యూస్, పాపన్నపేట
ప్రమాదవశాత్తూ నీట మునిగి ఓ వ్యక్తి మృతిచెందిన చెందిన సంఘటన ఏడుపాయల చెక్ డ్యాంలో శుక్రవారం చోటు చేసుకుంది.ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం వివరాలు…పాపన్నపేట గ్రామానికి చెందిన ఆకుల క్రిష్ణ(30) కూలీ పనులు చేస్తూ జీవితం గడుపుతున్నాడు.గురువారం రాత్రి సమయంలో ఏడుపాయల వద్ద ఉన్న తన తల్లి అంజమ్మ వద్దకు వెళ్లాడు.శుక్రవారం ఉదయం స్నానం చేసేందుకు ఏడుపాయల చెక్ డ్యాం వద్దకు వెళ్లి చెక్ డ్యాంలో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి గల్లంతయ్యాడు.అక్కడే ఉన్న స్థానికులు గమనించి కుటుంబీకులకు, పోలీసులకు సమాచారం అందించగా వారు అక్కడికి చేరుకుని గజ ఈతగాళ్ల సాయంతో గాలించింగ క్రిష్ణ మృతదేహం లభ్యమైంది.మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించి మృతుడి తల్లి అంజమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.
