నేడు విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో భజన భక్తుల సమ్మేళనం

 

వేద న్యూస్, పాపన్నపేట

 

విశ్వహిందూ పరిషత్(విహెచ్ పి) అధ్యక్షులు స్వర్గీయ,అశోక్ సింగాల్ శతజయంతి ఉత్సవాలలో భాగంగా ఈసంవత్సరం మొత్తం దేశవ్యాప్తంగా ఆయనను స్మరించుకుంటూ చాలా కార్యక్రమాలు చేయాలని అఖిలభారత విశ్వహిందూ పరిషత్ పెద్దలు నిర్ణయించినట్లు మెదక్ విశ్వ హిందూ పరిషత్ సేవా ప్రముఖ పిప్పిరి రవీందర్ గుప్తా శుక్రవారం రోజు తెలిపారు.ఇందులో భాగంగానే శనివారం రోజు మెదక్ మాయ గార్డెన్స్ లో భజన భక్తుల సమ్మేళనం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.అశోక్ సింగల్ వారి జీవితాంతం హిందూ ధర్మ పరిరక్షణకు,అయోధ్యలోని రామాలయం కొరకు జీవితమంతా పోరాడిన గొప్ప వ్యక్తి అశోక్ సింగల్ మెదక్ జిల్లా కేంద్రంలో నిర్వహించే మొట్టమొదటి కార్యక్రమంగా జిల్లాలోని సుమారు 100 గ్రామాల భజన మండలిలను పిలిచి,ఏభజన అయినా మనందరం సంఘటితంగా ఉండాలనీ పిలుపునిచారని, ఈదేశం కొరకు, హిందువుల మనుగడ కొరకు పాటుపడాలనే సందేశాన్ని ఇవ్వడానికి, పెద్దలు అప్పల ప్రసాద్ జి హాజరవుతున్నట్లు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *