వేద న్యూస్, హనుమకొండ :

రోడ్డు ప్రమాదంలో గాయపడి మంచానికే పరిమితమై పేదరికంలో మగ్గుతున్న కుటుంబానికి నిత్యావసర సరుకులు పంపిణీ చేసి మియాపురం శ్రీకాంత్ చారి తన దాతృత్వాన్ని చాటుకున్నాడు.
హనుమకొండ పెద్దమ్మగడ్డలోని అక్షర కాలనీకి చెందిన మియాపురం శ్రీకాంత్ చారి బుధవారం తన పుట్టినరోజు సందర్భంగా గీసుకొండ మండలం ఎల్కుర్తి హవేలీ గ్రామానికి చెందిన మైదం ప్రవీణ్ మౌనిక కుటుంబానికి నిత్యావసర సరుకులను అందజేశారు. మూడు సంవత్సరాలుగా మంచానికి పరిమితమైన ప్రవీణ్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రామగిరి సుశీల్, స్థానికుడు మంద స్వామి ఉన్నారు.