వేద న్యూస్ పాపన్నపేట
పాపన్నపేట మండల పరిధిలోని నాగ్సన్పల్లి గ్రామంలో క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల సందర్భంగా గ్రామంలోని మూడు వేరువేరు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా నిల్వ ఉంచిన ఇసుకను గుర్తించారు. సదరు ఇసుక నిల్వాలపై విచారణ నిర్వహించగా, ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుకను నిల్వ చేసినట్లు గుర్తించడంతో మొత్తం మూడు చోట్ల కల మొత్తం 19 ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుకను గ్రామ జిపిఓ భూమయ్య సంబంధిత రెవెన్యూ అధికారుల సమక్షంలో సీజ్ చేశారు.
