వేద
న్యూస్, పాపన్నపేట
పాపన్నపేట మండల పరిధిలోని చిత్రియాల గ్రామానికి చెందిన పుట్టి స్వరూప సోమవారం అకాల మరణం చెందారు. ఆమె మృతి విషయం గ్రామ సర్పంచ్ బైరీ సురేష్ ద్వారా తెలుసుకున్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంఠరెడ్డి తిరుపతిరెడ్డి వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి అండగా నిలిచారు.
మృతురాలి కుటుంబ పరిస్థితిని తెలుసుకుని ఆమె మరణం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులకు కొంతైనా ఆర్థిక తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో స్థానిక నాయకుల ద్వారా రూ.5 వేల ఆర్థిక సహాయాన్ని బాధిత కుటుంబానికి అందజేశారు. ఆపదలో ఉన్న కుటుంబాలను ఆదుకోవడం, వారికి అవసరమైన సమయంలో అండగా నిలవడం సామాజిక బాధ్యత అని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు.
పుట్టి స్వరూప మృతి పట్ల గ్రామంలో విషాదం నెలకొంది. ఆమె కుటుంబానికి స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, నాయకులు తమ సానుభూతిని తెలియజేశారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన కంఠరెడ్డి తిరుపతిరెడ్డి స్పందన పట్ల స్థానిక నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బైరీ సురేష్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.